Gaganyaan TV-D1: కీలకమైన గగన్‌యాన్ టీవీ-డీ1 ప్రయోగం వాయిదా

Gaganyaan TV-D1: చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో విజయపధంలో ఉన్న ఇస్రోకు బ్రేక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గగన్‌యాన్ ప్రయోగంలో కీలకమైన టెస్ట్ దశ నిలిచిపోయింది. పూర్తి వివరాలు మీ కోసం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 21, 2023, 10:23 AM IST
Gaganyaan TV-D1:  కీలకమైన గగన్‌యాన్ టీవీ-డీ1 ప్రయోగం వాయిదా

Gaganyaan TV-D1: ఇస్రో గగన్‌యాన్ మిషన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. త్వరలో జరగనున్న ఈ ప్రయోగానికి సంబంధించి కీలకమైన టీవీ-డీ1 ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక సమస్యలేర్పడినట్టు ఇస్రో ప్రకటించింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం..

గగన్‌యాన్ ప్రయోగంలో కీలకమైంది టెస్ట్ వెహికల్ ప్రయోగం. దీనినే టీవీ-డీ1గా పిలుస్తారు. ఈ ప్రయోగం ప్రకారం భూమికి 17 కిలోమీటర్ల ఎత్తులో టీవీ-డీ1 తీసుకెళ్లి క్రూ మాడ్యూల్ మళ్లీ కిందకు తీసుకొస్తుంది. ఇదొక టెస్టింగ్ ప్రక్రియ. ఈ టెస్టింగ్ ప్రక్రియను శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించాల్సి ఉంది. ఉదయం 8.30 గంటలకు ప్రయోగించాల్సిన మిషన్ కొన్ని కారణాలో 15 నిమిషాలు వాయిదా పడింది. కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభానికి కేవలం 5 సెకన్ల ముందు ఈ ప్రయోగాన్ని ఇస్రో హఠాత్తుగా నిలిపివేసింది. ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్‌లో సాంకేతిక లోపం ఏర్పడినందున ఈ పరీక్షను చివరి నిమిషంలో ఇస్రో నిలిపివేసింది. 

ఈ సాంకేతిక సమస్యకు కారణం గుర్తించే పనిలో ఇస్రో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. టీవీ-డీ1 రాకెట్ అయితే సురక్షితంగానే ఉందని కేవలం సాంకేతిక లోపంతోనే ప్రయోగాన్ని నిలిపివేసినట్టుగా ఇస్రో తెలిపింది. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి అప్పుడు వివరాలు వెల్లడిస్తామన్నారు. అన్నింటినీ పరిశీలించి, సరిచేసి తిరిగి ఈ ప్రయోగాన్ని చేపడతామన్నారు. 

2025లో చేపట్టనున్న గగన్‌యాన్ పరీక్షలో ఇవాళ జరగాల్సిన టీవీ-డీ1 ప్రయోగం అత్యంత కీలకం. క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్ధత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను తిరిగి క్షేమంగా కిందకు దించే వ్యవస్థ పటిష్టతను ఈ ప్రయోగం ద్వారా పరిశీలించనున్నారు. 

Also read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఇప్పట్లో ఊరట లభించదా, దసరా సైతం జైళ్లోనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News