BIHAR ASSEMBLY ELECTION 2020: ముంబై: బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. బీహార్ ఎన్నికల ప్రచార సంగ్రామం ఇంకా ప్రారంభం కాకముందే.. శివసేన (shiv sena)కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) బీహార్ బీజేపీ, జేడీయూ (BJP-JDU) ప్రభుత్వంపై తనదైన శైలిలో పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి, శాంతిభద్రతల అంశాలపై పోటీ చేయాలని నితీశ్ కుమార్ ( Nitish Kumar ) ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ బీహార్ ఎన్నికల ప్రచారంలో సమస్యలు లేవంటే చెప్పండి.. ముంబై నుంచి సమస్యలను పార్శిల్ చేస్తాం.. అంటూ ఎన్డీయే (NDA) కూటమిపై శివసేన నేత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతోపాటు బీహార్లో పోటీపై అధ్యక్షుడు, సీఎం ఉద్ధవ్ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని, ఆయనదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. Also read: Bharat Ratna to SP Balu: గానగంధర్వుడికి భారతరత్న ఇవ్వాలి: అర్జున్ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత ఎన్నికల కమిషన్ నిన్న బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలు మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో పోలింగ్ జరుగుతుందని, నవంబర్ 10న ఫలితాలు వెలుడుతాయని పేర్కొంది. ఈ క్రమంలో దీనిపై కూడా సంజయ్ రౌత్ పలు వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో కోవిడ్ పూర్తిగా నిర్మూలం కాలేదని.. దీనిపై కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఓటర్లు ఓటును ఎలా వినియోగించుకుంటారని, నాయకులు ఎలా ప్రచారం చేస్తారంటూ ప్రశ్నించారు. Also read: Vijay pays last respects to SPB: బాలుకు విజయ్ అంతిమ నివాళి


బీహార్ ఎన్నికలు సుశాంత్ మరణం చుట్టే తిరుగుతాయని వస్తున్న రాజకీయ విమర్శలపై కూడా ఆయన సంజయ్ రౌత్ మాట్లాడారు. ఈ కేసు సుశాంత్ ఆత్మహత్య నుంచి ప్రారంభమై.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరిధిలోకి వెళ్లిందని.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందంటూ ఆయన పేర్కొన్నారు. Mumbai Drugs case: విచారణకు హాజరైన ప్రముఖ హీరోయిన్లు