Bharat Ratna to SP Balu: గానగంధర్వుడికి భారతరత్న ఇవ్వాలి: అర్జున్

ఎన్నోవేల పాటలను పాడి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని హీరో అర్జున్ కోరారు. కరోనా బారిన పడిన అనంతరం దాదాపు నెలన్నర రోజులు చెన్నైలోని MGM ఆసుపత్రిలో బాలు చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

Last Updated : Sep 26, 2020, 03:10 PM IST
Bharat Ratna to SP Balu: గానగంధర్వుడికి భారతరత్న ఇవ్వాలి: అర్జున్

Actor Arjun Demands Bharat Ratna to SP Balu: ఎన్నోవేల పాటలను పాడి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి  (SP Balu) భారతరత్న అవార్డు (Bharat Ratna) ఇవ్వాలని హీరో అర్జున్ కోరారు. కరోనా బారిన పడిన అనంతరం దాదాపు నెలన్నర రోజులు చెన్నైలోని MGM ఆసుపత్రిలో బాలు చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. చాలామంది ప్రముఖులు, అభిమానులు బాలసుబ్రహ్మణ్యంను కడసారి చూసేందుకు ఫాంహౌస్‌కి చేరుకున్నారు. అయితే ఆయన అంత్యక్రియలకి హీరో అర్జున్ (Actor Arjun Sarja) కూడా హాజరై బాలుకి చివరిసారిగా నివాళులు అర్పించారు. అనంతరం అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఎన్నోవేల పాటలు పాడి.. సినీ ఇండస్ట్రీలో గాన గంధర్వుడిగా పేరుపొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యనికి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. Also read: Vijay pays last respects to SPB: బాలుకు విజయ్ అంతిమ నివాళి

ఇందుకోసం తెలుగు, మ‌ల‌యాళ‌, త‌మిళం ఇండ‌స్ట్రీలన్నీ క‌లసి రావాలని అర్జున్ సూచించారు. దాదాపు 45 వేలకుపైగా పాట‌లు పాడడం అంటే రెండు జ‌న్మలు ఎత్తిన పాడ‌లేరని అర్జున్ స్పష్టంచేశారు. ఇదిలాఉంటే.. బాలసుబ్రహ్మణ్యం అభిమానులు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన గాయకుడు బాలుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని కొంతమంది డిమాండ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.  Also read : SPB cremated with full state honors: ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి

Trending News