IT Returns filing: ఐటి రిటర్న్స్ ఇంకా దాఖలు చేయలేదా ?
IT Returns filing last date extended: న్యూఢిల్లీ: సెప్టెంబర్ 30వ తేదీతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు( ITR filing ) గడువు పూర్తయిపోయింది కదా ఇప్పుడెలా అని ఆందోళన చెందుతున్న పన్ను చెల్లింపుదారులకు ( Tax payers ) గుడ్ న్యూస్.
IT Returns filing last date extended: న్యూఢిల్లీ: సెప్టెంబర్ 30వ తేదీతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు( ITR filing ) గడువు పూర్తయిపోయింది కదా ఇప్పుడెలా అని ఆందోళన చెందుతున్న పన్ను చెల్లింపుదారులకు ( Tax payers ) గుడ్ న్యూస్. 2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును ఆదాయ పన్ను విభాగం ( Income tax ) మరో రెండు నెలలు (నవంబర్ 30 వరకు) పొడిగించినట్టు ప్రకటించింది. కొవిడ్-19 సంక్షోభంతో ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ( CBDT ) బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. ఆదాయపన్ను విభాగం ట్విటర్ ద్వారా ఈ వివరాలు వెల్లడించింది. Also read : Jobs in USA: 2023 వరకు ఈ కష్టాలు తప్పవట
2019-20 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆలస్యంగా దాఖలు చేసే ఇన్‌కమ్ టాక్స్ రిటర్నులతోపాటు ( Belated ITR filing ) సవరించిన రిటర్నుల దాఖలు ( Revised returns filing ) గడువును సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించినట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు ఐటి రిటర్న్ దాఖలుకు వీలు కల్పిస్తూ కేంద్రం ఈ గడువును పెంచడం ఇది నాలుగోసారి. మొదట మార్చి 31 నుంచి జూన్ 30 తో ముగియనున్న ఈ గడువును ఆ తర్వాత జూలై 31కి పొడిగించారు. అనంతరం జూలై 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడిగించారు. తాజాగా సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 30కి పొడిగిస్తున్నట్టు సీబీడీటీ స్పష్టంచేసింది. Also read : Unlock 5.0 guidelines: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు.. కొత్తగా అందుబాటులోకి వచ్చే సేవలు