Unlock 5.0 guidelines: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు.. కొత్తగా అందుబాటులోకి వచ్చే సేవలు

Unlock 5.0 guidelines, major changes after unlock 5.0 న్యూ ఢిల్లీ: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేస్తూ కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన చేసింది. అక్టోబర్ 15 నుంచి అన్‌లాక్ 5.0 అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. కేంద్రం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు  ( Cinema halls, multiplex theatres ) తెరుచుకోనున్నాయి.

Last Updated : Oct 1, 2020, 07:23 AM IST
Unlock 5.0 guidelines: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు.. కొత్తగా అందుబాటులోకి వచ్చే సేవలు

Unlock 5.0 guidelines, major changes after unlock 5.0 న్యూ ఢిల్లీ: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేస్తూ కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన చేసింది. అక్టోబర్ 15 నుంచి అన్‌లాక్ 5.0 అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. కేంద్రం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం 
అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు  ( Cinema halls, multiplex theatres ) తెరుచుకోనున్నాయి. ఐతే భౌతికదూరం ( Social distancing ) లక్ష్యం దెబ్బతినకుండా 50% సీటింగ్‌తో మాత్రమే థియేటర్లు నడవాలని కేంద్రం షరతు విధించింది. Also read : 
UPSC Civil Exam: వాయిదాకు సుప్రీం నో.. యథాతథంగా సివిల్ పరీక్ష

  • కంటైన్మెంట్ జోన్లలో ( Containment zones ) అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ కొనసాగించనున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం ఈ మార్గదర్శకాలలో పేర్కొంది.
  • కంటైన్మెంట్ జోన్లు కాని చోట లాక్‌డౌన్ ( Lockdown ) విధించకూడదని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టంచేసింది.
  • క్రీడాకారుల కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఇస్తున్నట్టు కేంద్రం తెలిపింది. 
  • అక్టోబర్ 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులు, కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తిని బట్టి పాఠశాలలు పునఃప్రారంభించే నిర్ణయం తీసుకునే స్వేచ్చను కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. 
  • స్కూల్స్‌కి హాజరుకాకుండా ఆన్‌లైన్ తరగతులకు ( Online classes ) హాజరవ్వాలి అనుకునే విద్యార్థులకు అందుకు అవకాశం కల్పించాలని, పాఠశాలకు వచ్చే విద్యార్థుల విషయంలో వారి తల్లిదండ్రుల అంగీకారం మేరకే వారిని పాఠశాలకు అనుమతించాల్సిందిగా కేంద్రం పేర్కొంది. సోషల్ డిస్టెన్సింగ్ లక్ష్యం దెబ్బతినకుండా కొంతమంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతుల విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.  
  • కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ( International flights ) నిషేధం కొనసాగనుందని కేంద్రం వెల్లడించింది. Also read : India Covid-19: 62 లక్షలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి తీసుకున్న నివేదికల ఆధారంగానే అన్‌లాక్ 5 మార్గదర్శకాలు రూపొందించినట్టు కేంద్రం స్పష్టంచేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News