ITBP Recruitment 2022: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో 108 కానిస్టేబుల్ (Pioneer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం పదో తరగతి విద్యార్హతతో మంచి వేతనంతో కూడిన ఈ ఉద్యోగాల కోసం చాలామంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తుంటారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు సెప్టెంబర్ 17, 2022 లోగా అప్లై చేసుకోవాలి. ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖాళీల వివరాలు :


పోస్ట్ : కానిస్టేబుల్ (కార్పెంటర్)
ఖాళీలు : 56
పేస్కేల్ : రూ.21,700-రూ.69,100 పే లెవల్-3


పోస్ట్ : కానిస్టేబుల్ (మేషన్)
ఖాళీలు : 31


పోస్ట్ : కానిస్టేబుల్ (ప్లంబర్)
ఖాళీలు : 21


విద్యార్హతలు, వయో పరిమితి :


పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై కార్పెంటర్ లేదా మేషన్ లేదా ప్లంబర్ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు


వయో పరిమితి : అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. 


అప్లికేషన్ ఫీజు : 


ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం : 


ఆసక్తి, తగిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు recruitment.itbpolice.nic.in. ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. ఆగస్టు 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 17న దరఖాస్తులకు చివరి గడువు.


అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ :


శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక ధృఢత్వ పరీక్ష (పీఎస్‌టీ), రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


Also Read: Mlc Kavitha: కేసీఆర్ ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర.. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత


Also Read: Delhi Liqour Scam: బీజేపీలో చేరితే  సీబీఐ, ఈడీ కేసులు ఎత్తేస్తామని ఆఫర్.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook