దేశంలో ఉగ్రవాద చర్యలపై కీలక సమాచారం అందుతోంది. పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ( Terror attacks ) కుట్రపన్నినట్లుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. జమ్ముకాశ్మీర్ సహా దేశంలోని పలు కీలక ప్రాంతాల్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారతదేశ నిఘా వర్గాలకు అందిన సమాచారం అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగవచ్చనేదే ఈ సమాచారం. జైష్ ఎ మొహమ్మద్ సంస్థ ( jaish e mohammad ), పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ( ISI ) కలిసి పెద్ద ఎత్తున విధ్వసం రచించారని నిఘా వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ ( Jammu Kashmir ) సహా దేశంలోని పలు కీలక ప్రాంతాల్ని దాడులకు టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఆగస్టు 20న పాకిస్తాన్ లోని రావల్పిండిలో ఐఎస్ఐ అధికార్లతో జైష్ ఎ మొహమ్మద్ కు చెందిన మౌలానా అబ్దుల్ రవూఫ్ అజ్హర్, షకీల్ అహ్మద్ లు సమావేశమైనట్టు నిఘా వర్గాల అధికారులు నిర్ధారించారు. ఇస్లామాబాద్ లోని మర్కజ్ లో ఉగ్రదాడికి ప్రణాళిక జరిగినట్టు తెలుస్తోంది. 


బాలాకోట్ దాడుల ( Balakot attacks ) అనంతరం రెండు అంశాలపై జైష్ ఎ మొహమ్మద్ కు చెందిన మౌలానా అమ్మార్..పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు చేస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. పుల్వామా దాడికి ముందు కూడా ఇటువంటిదే ఓ సమావేశం జరిగినట్టు సమాచారం. Also read: Building Collapsed: 15కు చేరిన మృతులు.. కొనసాగుతున్న రెస్క్యూ