Building Collapsed: 15కు చేరిన మృతులు.. కొనసాగుతున్న రెస్క్యూ

మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ ( Raigad District ) జిల్లా మహద్‌ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఘోర ప్రమాదం జరిగిన నాటినుంచి నిరంతరాయంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు సహాయక చర్యలను చేపడుతూనే ఉన్నాయి.

Last Updated : Aug 26, 2020, 09:29 AM IST
Building Collapsed: 15కు చేరిన మృతులు.. కొనసాగుతున్న రెస్క్యూ

Maharashtra Raigad building collapsed: ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ ( Raigad District ) జిల్లా మహద్‌ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం (building collapsed) కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఘోర ప్రమాదం జరిగిన నాటినుంచి నిరంతరాయంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు సహాయక చర్యలను చేపడుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 15కి చేరింది. మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, 8మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

అయితే.. మంగళవారం శిథిలాల నుంచి నాలుగేళ్ల బాలుడిని, 64ఏళ్ల మహిళను సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం సాయంత్రం భవనం కూలిన నాటి నుంచి నిరంతరాయంగా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. భవనం కింద సుమారు 75 మంది వరకు చిక్కుకున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇందులో 60 మంది వరకు రక్షించి గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. మృతుల బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra Govt) రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.1.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిబిల్డర్, ఆర్కిటెక్ట్ సహా ఐదుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. Also raed: JEE-NEET Exams: ఆ తేదీల్లోనే పరీక్షలు.. గైడ్‌లైన్స్ విడుదల

Trending News