మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఆయన జీఎస్‌టీ ప్రకటించిన సమయంలో వివేకవంతంగా ఆలోచించలేదని.. ఆయనను వెంటనే పదవి నుండి తొలిగించాలని సిన్హా అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఃనల్లధనం వెలికితీయడానికే నోట్లరద్దు అని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా విజయం సాధించలేకపోయిందని ఆ సందర్భంగా యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. ప్రధాని మోడీ వెంటనే జైట్లీని బాధ్యతల నుండి తప్పించి.. వేరే ఆర్థిక మంత్రి వేటలో పడాలని ఆయన తెలియజేశారు.


జీఎస్‌టీ అమలు విషయంలో ప్రభుత్వం తాము చేసిన తప్పిదాలను గుర్తిస్తోందని.. అందుకే మళ్లీ కొన్ని వస్తువులపై పన్నులను తగ్గించిందని.. ఆ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదని సిన్హా ప్రశ్నించారు.


మాజీ ఆర్థిక మంత్రి అయిన యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ "సోదాల పేరుతో నేడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చాలా ఆస్తులను జప్తు చేస్తున్నారు. డబ్బును సీజ్ చేస్తున్నారు. అయితే ఆ డబ్బు నల్లధనమో.. తెల్లధనమో తెలియడానికి మాత్రం కొన్ని సంవత్సరాలు పడుతుంది. డీమానిటైజేషన్ జరిగి ఒక సంవత్సరం కావస్తోంది. ఇప్పుడైనా ప్రభుత్వం నల్లధనాన్ని పూర్తిగా అరికట్టిందని చెప్పగలుగుతుందా.. అందుకు సమాధానం వారి వద్ద లేదు" అని అన్నారు.