Tamil Nadu govt grants permission for Jallikattu | చెన్నై: కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న తరుణంలో తమిళనాడులో సంక్రాంతి (sankranthi 2021) పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే జల్లికట్టు క్రీడ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ జల్లికట్టును కరోనా గైడ్‌లైన్స్‌తో (COVID-19 restrictions) నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో.. ప్రభుత్వం (Tamil Nadu govt ) కీలక నిర్ణయం తీసుకోని జల్లికట్టు నిర్వహణకు బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జల్లికట్టు (Jallikattu) లో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 150 కంటే ఎక్కువ ఉండొద్దని సూచించింది. ఈ క్రీడలో పాల్గొనే వ్యక్తులకు కోవిడ్‌-19 నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలని.. ప్రేక్షకుల సంఖ్య కూడా 50 శాతానికి మించొద్దని ప్రభుత్వం (Tamil Nadu) మార్గదర్శకాలను ఇచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఏటా జల్లికట్టు పోటీలు నిర్వహించడం తమిళనాడులో ఆనవాయితీగా వస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉన్నప్పటికీ వచ్చే జనవరి 15 నుంచి 17వ తేదీ వరకు జల్లికట్టును నిర్వహించేందుకు తమిళనాడులోని ఆయా కమిటీలు తీర్మానాలు చేశాయి. కరోనా నిబంధనలను సడలించి, జల్లికట్టు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరడంతో మార్గం సుగమం అయింది. Also read: West Bengal: మమతా కీలక నిర్ణయం.. తెలుగు భాషకు అధికార హోదా


యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీం కోర్టు జల్లికట్టును 2014లో నిషేధించింది. అయితే తమిళనాడులో జల్లికట్టు సంస్కృతిలో భాగమని రాష్ట్ర ప్రభుత్వం వాదించినప్పటికీ అప్పట్లో అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత రాష్ట్రంలో జల్లికట్టు అభిమానులు, ప్రజల భారీ నిరసనల తర్వాత చట్ట సవరణలతో 2017లో ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. Also Read: Amit Shah: సీఏఏపై కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook