PM Narendra Modi condemns killing of BJP workers in J&K’s Kulgam: న్యూఢిల్లీ: జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ముగ్గురు బీజేపి కార్య‌క‌ర్త‌ల‌పై కాల్పులు ( Terror attacks ) జ‌రిపి పొట్టనబెట్టుకున్నారు. అయితే బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదుల దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఖండించారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. మా ముగ్గురు యువ కార్యకర్తలను హత్య చేయడాన్ని తాను ఖండిస్తున్నానని మోదీ చెప్పారు. వారు జమ్మూ కాశ్మీర్ అద్భుతమైన పని చేస్తున్న ప్రకాశవంతమైన యువకులని..ఈ దు:ఖ: సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబాలతో ఉన్నాయి.. అంటూ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే.. ఈ హత్యలపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీజేపీ నేతలు ఖండించారు.  Also read: BJP workers murder: బీజేపి కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు మృతి



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమ్మూకశ్మీరులోని కుల్గాం జిల్లాలోని ఖాజిగుండ్ ప్రాంతంలోని వైకె పొరా గ్రామంలో గురువారం రాత్రి 8.20 గంటలకు బీజేపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలపై ఉగ్రవాదులు (3 BJP workers murder) కాల్పులు జరిపారు. ఈ ఉగ్రవాదుల కాల్పుల్లో కుల్గాం జిల్లా బీజేపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు ఫిధాహుసేన్ యాటూ, ఉమర్ రషీద్ బీగ్, ఉమర్ రంజాన్ హజామ్‌లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు. అయితే ఈ దాడి అనంతరం భద్రతాదళాలు, పోలీసులు ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. 


 Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe