JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్

JEE Mains topper arrested for using impersonator: జేఈఈ మెయిన్స్‌లో 99.8% మార్కులతో టాపర్‌గా నిలిచిన అస్సాం విద్యార్థిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని ఐఐటిలు సహా అన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 5న జేఈఈ మెయిన్స్ పరీక్షలు ( JEE mains exam ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ( JEE Mains results 2020 ) సైతం వెల్లడయ్యాయి.

Last Updated : Oct 29, 2020, 09:30 PM IST
JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్

JEE Mains topper arrested for using impersonator: జేఈఈ మెయిన్స్‌లో 99.8% మార్కులతో టాపర్‌గా నిలిచిన అస్సాం విద్యార్థిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని ఐఐటిలు సహా అన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 5న జేఈఈ మెయిన్స్ పరీక్షలు ( JEE mains exam ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ( JEE Mains results 2020 ) సైతం వెల్లడయ్యాయి. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో అస్సాంకి చెందిన నీల్ నక్షత్ర దాస్ అనే విద్యార్థి 99.8శాతం మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఐతే ఆ రోజు అసలు నీల్ నక్షత్ర దాస్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌కి హాజరు కాలేదని.. అతడి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాశాడంటూ మిత్రదేవ్ శర్మ అనే వ్యక్తి అక్టోబర్ 23న అస్సాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also read : Bank Jobs 2020: యూకో బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 

మిత్రదేవ్ శర్మ ఫిర్యాదును స్వీకరించిన అస్సాం పోలీసులు ( Assam police ).. నీల్ నక్షత్రదాస్‌తో పాటు అతడి తండ్రి డాక్టర్ జ్యోతిర్మయ్ దాస్‌ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నీల్ నక్షత్రదాస్, జ్యోతిర్మయ్ దాస్ కాకుండా మరో ముగ్గురు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్టు అస్సాం పోలీసులు తెలిపారు. 

గౌహతిలోని బోర్జహర్ ఏరియాలో పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన నిందితుడు.. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ( Biometric verification ) పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఇన్విజిలేటర్ సహాయంతో బయటికి వచ్చి తన స్థానంలో మరో విద్యార్థిని పంపించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్విజిలేటర్ పాత్ర కూడా ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. Also read : JEE MAINS EXAM: శుభవార్త..ఇకపై అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష

Trending News