Jammu Kashmir Assembly Elections: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌ లో  అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికీ చేరుకున్నాయి. ఈ రోజు మూడవ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశ లో 40 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.  చివరి విడతలో మిగతా  జమ్ము ప్రాంతంలోని, జమ్ము, ఉద్ధంపుర్‌, సాంబ, కథువా, ఉత్తర కశ్మీర్‌ ప్రాంతంలో బారాముల్లా, బందిపొరా, కుప్వారా జిల్లాల్లోని పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 415 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకొంటున్నారు. వీరిలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్‌ బెయిగ్‌ ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకూ జమ్ము కశ్మీర్‌లో రెండు విడతల పోలింగ్‌ పూర్తి అయ్యింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను ఇప్పటికే రెండు విడతల్లో 50 చోట్ల పోలింగ్‌ జరిగింది. జమ్ముకశ్మీర్‌ ఎన్నికల తొలి విడతలో 61.38 శాతం, రెండో విడతలో 57.31 శాతం పోలింగ్‌ నమోదైంది. మూడో విడతలోనూ వీలైనంత ఎక్కువ శాతం ఓటింగ్‌ లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని భద్రతా  ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.


ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పాకిస్థాన్, ఆర్టికల్ 370, ఉగ్రవాదం, రాష్ట్ర హోదా, రిజర్వేషన్ల అంశాలపై ప్రచారం నిర్వహించాయి. భారతీయ జనతా పార్టీ తరుపున  ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ అధ్యక్షుడు JP నడ్డా విస్త్రతంగా ప్రచారం చేశారు. విపక్షాలు అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తాయని, ఉగ్రవాదులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటాయని పెద్దఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ తరఫున మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే జమ్ముకశ్మీర్‌ కు రాష్ట్రహోదాను పునరుద్ధరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పెద్దఎత్తున ప్రచార సభలు నిర్వహించింది. అటు మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపిఈ సారి జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించలేదు. మరోవైపు ఉగ్రవాది ఇంజీనర్ రషీద్ పార్టీతో పాటు చిన్నా చితకా పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక జమ్ము కశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు అక్టోబర్‌ 8న వెలువడనున్నాయి. అదే హర్యానా రాష్ట్ర ఫలితాను వెల్లడించనున్నారు.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.