Five Army Soldiers Killed In Rajouri Encounter: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. రాజౌరీలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల బాంబు దాడిలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మరో సైనికులు చికిత్స పొందుతున్నారు. రాజౌరీ సెక్టార్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ త్రినేత్రలో భాగంగా గాయపడిన ముగ్గురు సైనికులు దురదృష్టవశాత్తు శుక్రవారం తెల్లవారుజామున మరణించారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీకి చెందిన ట్రక్కుపై దాడులకు తెగపడగా.. ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టులు జరిపిన దాడిలో ట్రక్కు మంటల్లో చిక్కుకోగా.. ఐదుగురు సైనికులు సజీవ దహనం అయ్యారు. భారీ వర్షాలను అనుకూలంగా మార్చుకున్న ఉగ్రవాదులు.. సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. అనంతరం ఉగ్రవాదులు తప్పించుకుని రాజౌరీ సెక్టార్‌లోని కాండి అడవుల్లోని ఓ గుహలో దాక్కున్నారని ఆర్మీ అధికారులకు సమాచారం అందిందింది. దీంతో మే 3వ తేదీ నుంచి ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు.


శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో గుహలో దాక్కున్న ఉగ్రవాదులను సెర్చ్ పార్టీ చుట్టుముట్టింది. అయితే దట్టమైన అటవీ ప్రాంతం కావడం.. చుట్టూ రాళ్లు ఉండడంతో ఉగ్రవాదులను మట్టుపెట్టడం కష్టంగా మారింది. ఇదే అదనుగా ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు తెగబడ్డారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు పేలుడు పదార్థాలను వినియోగించారు. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ అధికారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ ముగ్గురు శుక్రవారం మరణించారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. మరో ఆర్మీ అధికారి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రాంతంలో ముష్కరులు చిక్కుకుపోయారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు కూడా మరణించి ఉంటారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. రాజౌరీ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి.. ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసేందుకు ఆర్మీ బృందాలు శ్రమిస్తున్నాయి. ఐదుగురు సైనికులు వీర మరణం పొందడంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆర్మీ సిబ్బంది మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. 


Also Read: RR Vs GT Dream 11 Prediction: టాప్ ప్లేస్‌కు టఫ్‌ వార్.. రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ అమీతుమీ.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!  


Also Read: YS Sharmila: మాకు నమ్మకం లేదు దొరా.. సిట్‌తోనే మమ అనిపిస్తున్నారు: వైఎస్ షర్మిల  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook