YS Sharmila Complaint on Minister KTR: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకులకు ఐటీ శాఖ లోపాలే కారణమని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఒక ఐపీ అడ్రస్ తెలిస్తే సులభంగా పేపర్ ఎలా లీక్ చేయొచ్చు..? అని ప్రశ్నించారు. 2000 ఐటీ శాఖ చట్టం ప్రకారం.. ప్రభుత్వ పరిధిలో వాడే ప్రతి కంప్యూటర్ ఆడిట్ జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరిధిలో వాడే ప్రతి కంప్యూటర్ ఐటీ శాఖ పరిధిలో ఉంటుందని.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వైఫల్యం ఇదని ఆరోపించారు. కేటీఆర్, ఆయన పీఏకి ఇందులో హస్తం ఉందన్నారు. అందుకే సిట్ దర్యాప్తు వేశారని అన్నారు. ఐటీ శాఖపై విచారణ జరపాలని కోరుతూ శుక్రవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు చేశామని తెలిపారు.
'ప్రగతి భవన్ నుంచే సిట్ దర్యాప్తు సాగుతుంది. ప్రగతి భవన్ చెప్పినట్లే దర్యాప్తు సాగుతుంది. రాష్ట్రంలో డిజిటల్ భద్రత లేదు. కేటీఆర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకుల వెనుక నేను బాధ్యుడిని కాదు అంటున్నాడు. ప్రతి కంప్యూటర్‌కు నేను మంత్రిని కాదు అంటున్నాడు. రాష్ట్రంలో ఏ సిస్టమ్‌కి ఆడిట్ లేదు. ఆడిట్ చేసినట్లు సర్టిఫికెట్లు లేవు. టీఎస్‌పీఎస్‌సీలో ఏ కంప్యూటర్‌కి ఫైర్ వాల్స్ లేవు. కంప్యూటర్లకు భద్రత ఉన్నాయని సర్టిఫికెట్లు బయట పెట్టాలి. భద్రత లేకుండా మళ్లీ పరీక్షలు పెడుతున్నారు. మళ్లీ పేపర్ లీక్ కాదని గ్యారెంటీ ఏంటి..?
కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఆయన మీద కేసు పెట్టాం.. ఇది చిన్న కేసు అయినట్లు.. సిట్‌తోనే మమ అనిపిస్తున్నారు. తీగ లాగితే ప్రగతి భవన్ డొంక కదులుతుందని భయం. రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీ అని కేసీఅర్ చెప్పాడు. అసెంబ్లీలో నిలబడి చెప్పి రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు 30 వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయని హడావుడిగా పరీక్షలు పెడుతున్నారు. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. భద్రత కల్పించి నిరూపించిన తర్వాతే పరీక్షలు పెట్టాలి. డిజిటల్ సెక్యూరిటీ ఉందని చెప్పాలి. పేపర్ మళ్లీ లీక్ కాదని భరోసా ఇవ్వాలి..' అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Also Read: IND vs PAK Match: భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Sharmila: మాకు నమ్మకం లేదు దొరా.. సిట్‌తోనే మమ అనిపిస్తున్నారు: వైఎస్ షర్మిల