న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి విజృంభణ తీవ్రమైన నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే పరిస్థితులపై ఈ విపత్తును ఎదుర్కోవటానికి  చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రధాని Narendra modi మాట్లాడుతూ.. ప్రజలు అనవసరమైన భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు అవసరమని అన్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రాబోయే 15 రోజులు ముఖ్యమైనవని, అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కరోనావైరస్ విషయంలో అందుకే ఆందోళన తప్పడంలేదు: ప్రధాని మోదీ


గత రెండు నెలల నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రూపంలో వచ్చిన విపత్తు ప్రపంచాన్ని వణికిస్తోందని, ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురిచేస్తుందని ఇది దురదృష్టకరమన్నారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో కూడా ప్రస్తుత మహమ్మారి కరోనా వైరస్ చేస్తున్నంత నష్టం చేయలేదని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం దేశంలోని 130 కోట్ల భారతీయుల సహకారం కావాలని, కరోనా మహమ్మారి బారినుండి రక్షించుకోవాలన్నారు. 


Read Also: నిర్భయ దోషులకు రేపే ఉరి..!!


కరోనా వైరస్ విషయంలో ఆందోళన సహజమే. అయినప్పటికీ  కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి  శాస్త్ర పరిశోధనలు కొనసాగుతున్నాయని అన్నారు. మరోవైపు ఇప్పటికే కరోనా విషయంలో కొన్ని దేశాలు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాయని, భారత్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని క్షుణ్ణంగా అంచనా వేస్తుందని, దీనికి పౌరుల సహకారం ముఖ్యమైనదని పేర్కొన్నారు. 


Read Also: CBSE బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా 


మార్చి 22న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పౌరుల కోసం జనతా కర్ఫ్యూ విధించబడుతుందని, అత్యవసరమైతేనే తప్ప బయటికి వెళ్లకూడదని, పౌరులందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ జనతా కర్ఫ్యూ విషయంలో సమాజంలోని అన్నీ రకాల సంస్థలు ప్రజలకు మార్గనిర్దేశనం చేయాలని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..