చెన్నై: జయలలిత ఆరోగ్యంపై ఇప్పటికీ సస్పెన్స్ అలానే ఉంది. ఆమెకు చనిపోతున్న ముందు ఎలాంటి వైద్యం ఇచ్చారో ఎవరికీ తెలీదు. బయటికి కూడా పొక్కనీయకుండా రహస్యంగా ఉంచారు. జయ మృతికిపై అనుమానాలు నెలకొనడంతో వాటిని నివృత్తిచేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ విచారణ కమిషన్ జయ మృతితో సంబంధమున్న వ్యక్తులను విచారిస్తోంది. 


ఈ నేపథ్యంలోనే 2016 శాసన సభ ఎన్నికలకు ముందు జయలలితకు ఆక్యుపంచర్ (సూది పొడుపు వైద్యం) వైద్యం అందించిన డాక్టర్ శంకర్ విస్తుగొలిపే నిజాన్ని బయటపెట్టాడు. చెన్నైలో విచారణ కమిషన్ ఎదుట హాజరైన ఆయన.. అప్పట్లో జయ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. తన వద్ద ఉన్న ఆధారాలను వారికి అందజేశారు. అపోలో హాస్పిటల్లో చేర్పించడానికి కొద్ది రోజుల ముందు జయలలితకు మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడారని.. అందుకే ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు.