JEE Main 2025 Registrations: దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్, అడ్వాన్స్ రెండు దశలు దాటాల్సి ఉంటుంది. తొలి దశ మెయిన్స్ పరీక్ష జనవరి 22 నుంచి 31 వరకూ జరగనుంది. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై మూడో వారం నడుస్తోంది. అయితే ఈసారి ఎందుకో జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మరో వారం రోజుల్లో గడువు ముగియనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 28న ప్రారంభమైాంది. నవంబర్ 22తో గడువు ముగియనుంది. అయితే ఇప్పటి వరకు అతి తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సమయానికి రెట్టింపు కంటే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకూ కేవలం 5.1 లక్షలమందే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 12.2 లక్షల మంది అప్లై చేసుకున్నారు. మెయిన్ డెడ్ లైన్ మరో వారం రోజుల్లో ముగియనుంది. అలాంటిది ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకోడానికి కారణాలేంటో పరిశీలిద్దాం.


కారణాలేంటి


జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ ఈసారి అమల్లోకి తెచ్చిన కొత్త డాక్యుమెంట్ నిబంధనలు ఓబీసీ, ఈడబ్ల్యూసీ విద్యార్ధుల్లో గందరగోళానికి కారణమైందని తెలుస్తోంది. ఆధార్ కార్డు, సర్టిఫికేట్లు మిస్ మ్యాచ్ అవడం మరో కారణంగా తెలుస్తోంది. దరఖాస్తుదారులు తమ కేటకరీ సర్టిఫికేట్ల ఐడీ, జారీ చేసిన తేదీ, జారీ చేసిన అధికారి పేరు, సర్టిఫికేట్ ఇక నుంచి సమర్పించాల్సి ఉంటుంది. ఇది కొత్త నిబంధన. ఇది ఓబీసీ, ఈడబ్ల్యూసీ విద్యార్ధుల కోసం మాత్రమే. చాలామంది విద్యార్ధులు ఈ వివరాలు అప్‌డేట్ చేసేటప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఆధార్ వెరిఫికేషన్ కూడా సమస్యగా మారింది. పదో తరగతి సర్ఠిఫికేట్‌లో పేరు, ఆధార్ కార్డులో పేరు మిస్ మ్యాచ్ అవుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఏకు భారీగా ఫిర్యాదులు వచ్చి చేరాయి. 


అయితే ఇటీవల నీట్ పరీక్ష విషయంలో జరిగిన గందరగోళం, కుంభకోణం నేపధ్యంలో పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏపై అపనమ్మకం కూడా దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి ఓ కారణమనే వాదన విన్పిస్తోంది. ఇంకో వారం రోజులే గడువు మిగిలుంది. ఇప్పటికైనా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందో లేదో చూడాలి.


ఎలా దరఖాస్తు చేయాలి


ముందుగా jeemain.nta.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో ఉండే జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎక్కౌంట్ లాగిన్ అయి అప్లికేషన్ నింపి నిర్ణీత ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా యూపీఐ ఏ రూపంలో అయినా ఫీజు చెల్లించవచ్చు. చివరిగా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. 


Also read: Smita Sabharwal: మహారాష్ట్రలో స్మిత సబర్వాల్.. అక్కడ కూడా మేడమ్ సర్.. మేడమ్ అంతే.. క్రేజ్ మాములుగా లేదుగా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.