JEE Mains 2024 Paper 2 Results: జేఈఈ మెయిన్స్ సెషన్ 1, సెషన్ 2 పరీక్షలతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్ని ప్రతియేటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంటుంది. జనవరి 24వ తేదీన జరిగిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 2 పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఇటీవలే పేపర్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి జేఈఈ మెయిన్స్ పరీక్ష అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, ఉర్దూ భాషల్లో నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 1 పరీక్షలు జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరగగా ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీన విడుదలయ్యాయి. దీనికి సంబంధించి పేపర్ 2 పరీక్షలు అంటే బీ ఆర్క్ , బీ ప్లానింగ్ పరీక్షలు జనవరి 24వ తేదీన జరగగా, ఫైనల్ కీ మార్చ్ 4న విడుదలైంది.  ఇవాళ తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్‌టీ‌ఏ అధికారిక వెబ్‌సైట్  jeemain.nta.nic.inలో ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు.


ముందుగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్  jeemain.nta.nic.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజిలో మీకు కన్పించే JEE (Main) B.Arch B.Planning session 1 క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ వివరాలు ఎంటర్ చేయాలి. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పేపర్ 2 ఫలితాలు ప్రత్యక్షమౌతాయి. 


జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 1 పరీక్షల్లో దేశవ్యాప్తంగా 23 మంది వందశాతం మార్కులు సంపాదించారు. ఈ 23 మందిలో తెలంగాణ నుంచి ఏడుగురు ఉన్నారు. ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. 


Also read: Unclaimed Deposits: దేశంలోని వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఎంతో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook