Jharkhand Road Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Jharkhand) జరిగింది. పాకూర్ జిల్లాలో (Pakur district) బుధవారం గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. అమ్రపర పోలీస్ స్టేషన్ (Amrapara police station) పరిధిలోని పదేర్‌కోలా గ్రామంలో (Paderkola village) ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు. బస్సు బర్వా నుంచి దంకాకు వెళ్తోంది. పొగమంచు కారణంగా రోడ్డు కనపడగ పోవటం వల్ల రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ట్రక్కు- బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారు" అని సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) అజిత్ కుమార్ విమల్ (Ajit Kumar Vimal) తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చాలా మంది వ్యక్తులు బస్సులో ఇరుక్కుపోయారని..వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వివరించారు. ట్రక్కుపై ఉన్న గ్యాస్ సిలిండర్ల పేలకపోవడంతో..పెను ప్రమాదం తప్పిందని వారు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 


Also Read: Man rapes dog: శునకంపై వృద్దుడి లైంగిక దాడి.. సీక్రెట్‌గా వీడియో తీసిన కోడలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook