Jharkhand Female SI Murder: జార్ఖండ్‌లో దారుణం జరిగింది. అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని వెంబడిస్తున్న క్రమంలో మహిళా ఎస్సై ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులే ఎస్సైని వాహనంతో డీకొట్టి చంపేశారు. హర్యానాలో మైనింగ్ మాఫియా డీఎస్పీ అధికారిని డంపర్‌తో ఢీకొట్టి చంపిన ఘటన మరవకముందే జార్ఖండ్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జార్ఖండ్‌లో హత్యకు గురైన ఎస్సైని సంధ్య టోప్నోగా గుర్తించారు. రాంచీలోని తుపుదానా పోలీస్ స్టేషన్‌లో సంధ్య ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం రాత్రి సమయంలో స్థానిక చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలకు వెళ్లారు. ఆ సమయంలో ఓ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు ఎస్సైకి సమాచారం అందింది. ఆ వాహనం చెక్ పోస్ట్ వద్ద ఆగకుండా ముందుకు వెళ్లడంతో సంధ్య టోప్నో.. దాన్ని వెంబడించారు. ఈ క్రమంలో నిందితులు ఆమెను వాహనంతో ఢీకొట్టి చంపారు.


ఈ ఘటనలో ఎస్సై సంధ్యకు తీవ్ర గాయాలవగా రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే సంధ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్సై సంధ్య హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.


ఇటీవల హర్యానాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మైనింగ్ మాఫియా కార్యకలాపాలను అడ్డుకున్నందుకు డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌ని డంపర్‌తో ఢీకొట్టి చంపేశారు. డీఎస్పీని ట్రక్కుతో ఢీకొట్టిన నిందితుడు ఇక్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.హర్యానా ఘటన మరవకముందే జార్ఖండ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అవడం పోలీసుల పట్ల మాఫియా ఆగడాలకు అద్దం పడుతోంది.


Also Read: OnePlus Smart TV : 40 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4599కే.. రూ.16500 తగ్గింపు..  


Also Read: Ram Gopal Varma: వాళ్ళ అంతు చూస్తా.. వదిలేదే లేదంటూ సీరియస్ వార్నింగ్



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook