Mining Mafia: హర్యానాలో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ అధికారిపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ట్రక్‌తో ఢీకొట్టారు. ఈ ఘటనలో పోలీస్ ఉన్నతాధికారి అక్కడికక్కడే మృతి చెందారు. ఆరావళి పర్వత ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసు అధికారి హత్య ఘటన ఆ శాఖలో గుబులు రేపుతోంది.
హర్యానాలోని పచగావ్ సమీపంలో అక్రమంగా రాయి తవ్వకాలు కొనసాగుతున్నాయి. గతకొంతకాలంగా దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈక్రమంలో తావ్‌డూకు చెందిన డీఎస్‌పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్..అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. దీనిని గమనించిన అక్రమార్కులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలోనే రాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును ఆపాలని ఆదేశించారు.
ఐనా లెక్కచేయకుండా ట్రక్కు డ్రైవర్..వాహనాన్ని పోలీస్ ఆఫీసర్‌పైకి పోనించాడు. ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ డీఎస్పీ సురేంద్ర సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. దాడి నుంచి మరో ఇద్దరు అధికారులు తప్పించుకున్నారు. దాడి అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారైయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు అక్రమార్కుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఆరావళిలో అక్రమ మైనింగ్‌పై 2009లోనే సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది. ఐనా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి.
Mining mafia crushed DSP with truck in Nuh (mewat), Haryana.
DSP Surendra Singh died on the spot.
Double Engine Sarkar #Haryana pic.twitter.com/TgaO6F6wcb
— Nageshwar Rao (@itsmeKNR) July 19, 2022
Also read:CM Jagan: మరోసారి మాట నిలబెట్టుకున్న సీఎం జగన్..మిగిలిపోయిన లబ్ధిదారులకు నిధుల జమ..!
Also read:Shiv Sena: శివసేనలో తీవ్రమవుతున్న ముసలం..తిరుగుబాటు జెండా ఎత్తిన ఎంపీలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook