Covid-19: జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్‌కు కరోనా
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు.
Jharkhand ex cm shibu soren tested covid-19 positive: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. తాజాగా జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ ( Shibu Soren ) తో పాటు ఆయన భార్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారి తనయుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
శుక్రవారం రాత్రి తన తల్లి, తండ్రి కరోనా పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయని, ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారని హేమంత్ సోరెన్ (Hemant Soren) ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజల దీవెనలతో తమ తల్లితండ్రులు త్వరగా కోలుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ISIS: రాజధానిలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమంలో శిబు సోరెన్ కీలక పాత్ర పోషించారు. యూపీఏ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. ఇదిలాఉంటే.. జూలైలో సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు ఆయన భార్యకు కూడా వైరస్ సోకింది. Also read: Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్