Jharkhand High Court: ప్రస్తుతం కొందరు యువత చాలా మంది పెళ్లి తర్వాత వేరుగా ఉండటానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఇంట్లో అడుగు పెట్టగానే.. ప్రాపర్టిని డివైడ్ చేయాలని, తాము సపరేట్ గా ఉంటామని రచ్చ చేస్తున్నారు. పాశ్చాత్య దేశంలో మాదిరిగా ఫ్రీడం కావాలని కోరుకుంటున్నారు. దీంతో చిన్న తనం నుంచి ఒకటే దగ్గర పుట్టి పెరిగి, జాయింట్ ఫ్యామిలీగా ఉన్న ఎన్నో కుటుంబాలు ప్రస్తుతం ఛిన్నా భిన్నం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలకు పులిస్టాప్ పెట్టేలా జార్ఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాలు..


జార్ఖండ్ లో ఒక కేసులో భార్య, తన కుమారుడితో కలిసి వేరుగా ఉంటుంది. దీనికోసం ప్రతినెల భరణం చెల్పించాలని ఆమె ఫ్యామిలీకోర్టులో కేసు వేసింది. దీనిలో ప్రధానంగా వివాహం తర్వాత భర్తతో వేరుగా ఉందామని డిమాండ్ చేసింది. దీనికి అతను అంగీకరించకపోవడంతో ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది.


Read Also: Snakes: ఈ చెట్లంటే పాములకు హడల్.. ఇవి ఉన్న చోట అస్సలు కన్పించవు..


అయితే.. తాజాగా, ఈ కేసును హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం.. భర్త తన కుటుంబంలో అంతర్భాగమని, ఇలా పెళ్లి కాగానే వేరుగా ఉంటామని ఒత్తిడి తీసుకురావడం సరికాదని ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా ఫ్యామిలీ కోర్టు చెప్పిన తీర్పులో పలు మార్పులు చేస్తూ.. ఈ కేసులో.. భార్యకు ప్రతినెల ఇవ్వాల్సిన భరణం రద్దు చేసి, కుమారుడికి రూ.25 వేలు చెల్లించాలని కూడా తీర్పు వెలువరించింది. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook