Snake Repellents Plants: కొన్నిసార్లు మన ఇంటి చుట్టుపక్కల పాములు కన్పిస్తుంటాయి. పాములు మెయిన్ గా చెట్ల పొదలు, అడవీ ప్రాంతం ఉన్న చోట ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఇవి పొలాలలో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎలుకలను తింటుంటాయి. కొన్ని పాములు ఒక పాము మరోక పాములను కూడా తినడం మనం గమనిస్తుంటాం. మనలో చాలా మంది పాములంటే చచ్చేంత భయపడిపోతుంటారు. పొరపాటున పాము కన్పించిందా.. ఇక అంతే సంగతులు. ఆ ప్రాంతానికి కూడా అస్సలు వెళ్లరు. అయితే.. ఇంట్లో ఎన్నిజాగ్రత్తగా ఉన్న కొన్నిసార్లు పాములు వస్తుంటాయి.
పాములు చీకటిగా ఉన్న ప్రదేశంలో నక్కి ఉంటాయి. అక్కడికి మనం పొరపాటున వెళ్లిన, దానికి ఆపద కల్గించినట్లు అది భావించిన కూడా కాటు వేస్తుంది. కొన్నిరకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే పాములు అస్సలు రావంట. ఇంట్లో వాకింగ్ ప్లాంట్, సదాప చెట్టు, బంతి పూల చెట్లు, క్లోవ్ బాసిల్, గార్లిక్ లను ఇంట్లో పెంచుకుంటే పాములు రావంట.
Read Also: Republic day 2024: రిపబ్లిక్ డే వేడుకలు.. భారతరాష్ట్ర సమితిని ఏకీపారేసిన గవర్నర్ తమిళిసై..
ముఖ్యంగా వాకింగ్ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంది. దీని నుంచి ప్రత్యేకమైన వాసన వస్తుందంట. దీన్నిపాములు అస్సలు ఇష్టపడవంట. సదాప చెట్టు కూడా ప్రత్యేకమైన పొదల మాదిరిగా పెరుగుతుంది. అందుకే పాముల భయం ఉన్న వారు తమ ఇంట్లో ఈ చెట్లను పెంచుకొవాలని చెబుతుంటారు. అదే విధంగా ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకొవాలి. (Disclimer:ఈ స్టోరీ అందు బాటులో ఉన్న సమాచారం, వైరల్ కంటెంట్ ఆధారంగా రాయబడింది. దీన్ని జీ మీడియా ధృవీకరించలేదు )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook