Jharkhand Train Accident: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
Train Accident today: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Jharkhand Train Accident: జార్ఖండ్‌లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జమ్తారా-కర్మతాండ్‌లోని కల్జారియా రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం ఎలా జరిగింది?
జార్ఖండ్‌లోని జమ్తారా-కర్మతాండ్‌లోని కల్జారియా ప్రాంతానికి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ లో ఆంగ్ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే రైలును ఆపేశారు రైల్వే అధికారులు. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దూకి ట్రాక్ అవతలి వైపుకు చేరుకున్నారు. ఇంతలో అటు నుంచి వస్తున్న భాగల్‌పూర్-యశ్వంత్‌పూర్ రైలు పట్టాలు దాటుతున్న 12 మందిపై నుంచి దూసుకెళ్లింది. రైలు ప్రమాదంపై తమకు సమాచారం అందిందని జమతారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ తెలిపారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, రైల్వే యంత్రాంగం తక్షణ సాయం అందించాలని కోరారు. అతను కూడా సంఘటన స్థలానికి బయలుదేరాడు.
Also Read: ISRO Second Space Station: రెండవ ఇస్రో స్పేస్ సెంటర్, శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook