స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఆగస్టు 15, 2018 తేది నుండి రిలయెన్స్ జియో ఫోన్ 2 బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆ విషయాన్ని రిలయెన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకొనే రీతిలో అన్ని ప్రముఖ ఫీచర్లతో కేవలం రూ.2,999కే రిలయెన్స్ 4జీ ఫీచర్‌ ఫోన్‌‌ను అందిస్తోంది. ఫిజికల్‌ కీ బోర్డ్‌, వాట్సాప్‌తో పాటు మిగతా ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. రిలయెన్స్ జియో ఫోన్‌-2ను జియో అధికారిక వెబ్‌సైట్‌ లేదా మై జియో యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని సంస్థ యాజమాన్యం ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లూటూత్‌, ఎఫ్‌ఎమ్‌ రేడియో, వీఓఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌ సౌకర్యాలతో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. 4 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌, 512 ఎంబీ ర్యామ్‌‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ బుక్ చేసుకొనే కస్టమర్లకు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం లేదు. ఈ ఫీచర్ ఫోన్‌ను బుక్ చేసుకోవాలంటే ముందుగానే ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్స్ పూర్తయిన వారం రోజుల్లోనే ఈ ఫోన్లు డెలివరీ చేస్తామని రిలయెన్స్ అధికారులు అంటున్నారు. 


ఇటీవలే రిలయెన్స్ యాజమాన్యం తమ వార్షిక సమావేశంలో దాదాపు 25 మిలియన్ల యూజర్లు భారతదేశంలో జియో సేవలను పొందుతున్నట్లు ప్రకటించింది. 100 మిలియన్ల మంది యూజర్లకు తమ సేవలు అందివ్వడమే తమ టార్గెట్ అని కూడా రిలయెన్స్ ప్రకటించింది. అందుకోసమే.. మరెంతో మంది ప్రజలకు జియో సేవలను అందించడం కోసం ఈ జియో ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది.