జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలో ఆదివారం తెల్లవారుఝామున ఉగ్రవాదులు మరోసారి భారత భద్రతాదళాలపై కాల్పులకు తెగబడ్డారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ట్రైనింగ్ సెంటర్లోకి చొరబడి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉగ్రదాడిలో ఒక సైనికుడు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఉదయం రెండున్నర గంటల సమయంలో జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏఎన్ఐ కధనం మేరకు తీవ్రవాదులు మొదట గ్రెనైడ్లను  విసిరారు. ఆతరువాత కాల్పులు ప్రారంభించారు అని తెలిపింది. "2:10 గంటలకు లెత్పోరా గ్రామంలో తమ శిబిరం వద్ద దాడి జరిగిందని, మరొక దాడికి కూడా అవకాశం ఉంది" అని సీఆర్పీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కారణంగా జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు. 



 


ఆగస్టులో, ఎనిమిది మంది భద్రతా సిబ్బంది పుల్వామాలోని ఒక జిల్లా పోలీసు కాంప్లెక్స్ లో తీవ్రవాద దాడిలో తమ ప్రాణాలను కోల్పోయారు.