JN.1 scare: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. కొత్త కేసులు ఎన్నంటే?
JN.1 variant Cases today: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 636 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో ముగ్గురు మృతి చెందారు.
India coronavirus cases today: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కొవిడ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదు చేసుకుంది. కొత్తగా 636 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. వైరస్ తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు మరియు తమిళనాడులో ఒకరు మృతి చెందారు. దీంతో మెుత్తం మరణాల సంఖ్య 5,33,364కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి 548 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 4.44 కోట్లకు చేరింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా.. కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.
మరోవైపు కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. డిసెంబరు 29 వరకు జేఎన్ 1 కేసులు 178కు చేరాయి. మెుత్తం తొమ్మిది రాష్ట్రాల్లో నమోదయ్యాయి. గోవాలో అత్యధికంగా 47 కేసులు రికార్డయ్యాయి, తర్వాత కేరళలో 41 , గుజరాత్‌లో 36, కర్ణాటకలో 34, మహారాష్ట్రలో తొమ్మిది, రాజస్థాన్ మరియు తమిళనాడులో చెరో నాలుగు, తెలంగాణలో రెండు, ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. నిన్న దేశంలో 841 కరోనా కేసులు నమోదయ్యాయి. 227 రోజుల వ్యవధిలో ఇదే అత్యధికం. చలికాలం కావడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్కులు ధరించడంతోపాటు గుంపుల్లో తిరగవద్దని చెప్పారు. ఒక వేళ వైరస్ బారినపడితే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.
Also Read: Amrit Bharat Express: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook