Amrit Bharat Express: అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

Amrit Bharat Express: భారతీయ రైల్వే అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయోధ్య వేదికగా రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2023, 12:57 PM IST
Amrit Bharat Express: అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

Amrit Bharat Express facilities: డిసెంబరు 30న  అయోధ్య వేదికగా రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.  ప్రధాని ప్రారంభించిన రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో మొదటిది ఢిల్లీ - బీహార్‌లోని దర్బంగా మధ్య, రెండోది మాల్దా (పశ్చిమ బెంగాల్‌)-బెంగళూరు మధ్య నడుస్తాయి. ఇందులో రెండో రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ ఏపీలో 14 రైల్వే స్టేషన్లలో ఆగనుంది. ఈ ట్రైన్ కు మెుత్తం 32 స్టాపులు ఉంటే.. అందులో 14 ఏపీలోనే ఉండటం విశేషం. 

అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలు
==> ఇది నాన్‌ ఏసీ రైలు. ఈ రైలు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
==>  పుష్- పుల్ అనే రెండు ఇంజిన్లు ఉండటం ఈ రైలు ప్రత్యేకత. 
==> ముందు వెనుక ఇంజిన్లు ఉండటం వల్ల ఇది తక్కువ సమయంలోనే వేగాన్ని అందుకుంటుంది. దీంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. 
==> అంతేకాకుండా వంపు మార్గాలు, వంతెనలపై ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం కుదుపులు లేకుండా సాఫీగా సాగుతుంది.
==> ఈ రైలులో 22 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్ కోచ్‌లు కాగా, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డ్ కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. 
==> ఇందులో కొన్ని సీట్లును మహిళలకు, దివ్యాంగులకు కేటాయించారు. 
==> ఈ రైలు ముందు భాగం ఏరోడైనమిక్‌ డిజైన్ లో రూపొందించారు. 
==> అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నారింజ మరియు బూడిద రంగులో ఉంటుంది.
==> ట్రైన్ లోపల ఆకర్షించే సీట్లు, CCTV, మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లు, పబ్లిక్ ఇన్పర్మేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. 
==> దీనిని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో తయారు చేశారు. ఇది రెండు WAP-5 లోకోమోటివ్‌లను కలిగి ఉంటుంది. 

Also Read: IRCTC Refund Rules: ఛార్ట్ ప్రిపేరయ్యాక టికెట్ క్యాన్సిల్‌పై ఫుల్ రిఫండ్ ఎలా వస్తుందో తెలుసా

Also Read: Ayodhya Railway Station: కొత్త ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్ ప్రారంభం.. అయోధ్య నగరికి కొత్త సొగసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x