Job Crisis: భారత్‌లో 69 శాతం మేర ఉద్యోగాలు కోల్పోడం ఖాయమా..?
Job Crisis In India: ప్రస్తుతం ప్రపంచలో జనాభా పెరుగుదలతో పాటు ఉద్యోగాల కల్పన అనేది అనుకున్న రీతిలో ఉండటం లేదు. దీంతో ప్రతీ దేశంలో నిరుద్యోగ రేటు అమాంతం పెరిగిపోతోంది.
Job Crisis In India: ప్రస్తుతం ప్రపంచలో జనాభా పెరుగుదలతో పాటు ఉద్యోగాల కల్పన అనేది అనుకున్న రీతిలో ఉండటం లేదు. దీంతో ప్రతీ దేశంలో నిరుద్యోగ రేటు అమాంతం పెరిగిపోతోంది. దీనికి తోడు టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. రోజూవారి కూలీలతో పాటు.. నెలవారీ జీతంగా తీసుకుంటున్న ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తోంది. ఆటోమేషన్ కారణంగా దేశంలో దాదాపు 69 శాతం మేర ఉద్యోగాలు కోల్పేయే ప్రమాదం ఉందని ఓ నివేదికలో తేలింది. దీంతో పాటు.. వచ్చే 20 ఏళ్లలో 160 మిలియన్ కార్మికులకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అదే నివేదికలో పేర్కొన్నారు. 'ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ ఫోర్‌కాస్ట్' ప్రకారం.. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా 2040 నాటికి 1.1 బిలియన్ల శ్రామిక శక్తి అవసరం అవుతుందని ఈ నివేదిక తెలిపింది.
కొత్త ఉద్యోగాల కల్పన:
ప్రస్తుతం పని చేస్తున్న శ్రామిక యువకులు సగటు వయస్సు 38 సంవత్సరాలు. రాబోయే 20 సంవత్సరాల కాలంలో శ్రామిక శక్తి అనేది 160 మిలియన్లకు చేరుకుంటుందని ఫారెస్టర్‌లోని ప్రధాన అంచనా విశ్లేషకుడు మైఖేల్ ఓగ్రాడీ అన్నారు. ఆసియా పసిఫిక్‌లోని ఆర్థిక వ్యవస్థలో అత్యధిక శ్రామిక జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా మరియు జపాన్ లు ఉన్నాయి. ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా కంటే కూడా ఫిజికల్ రోబోట్ ఆటోమేషన్ కారణంగా ఎక్కువ ప్రమాదం ఉంది. వ్యవసాయ రంగంలో ఆటోమేషన్ అనేది అధికంగా ఉండటం వల్ల 247 మిలియన్లకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని నివేదికలో పేర్కొన్నారు.
భారతదేశం, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా , జపాన్ వంటి దేశాలు 2040 నాటికి పునరుత్పాదక శక్తి, హరిత భవనాలు, స్మార్ట్ నగరాలు, స్మార్ట్ మౌలిక సదుపాయాలు వృత్తిపరమైన సేవలలో 28.5 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నట్లు నివేదికలో తేలింది. కానీ గ్రీన్ ఎకానమీ , ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ICT) పరిశ్రమలు ఈ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టించనుండగా.. 13.7 మిలియన్ ఉద్యోగాలు హోల్‌సేల్, రిటైల్, రవాణా, వసతి అండ్ విశ్రాంతి రంగాలలో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలో తెలిపారు.
చైనాలో తగ్గనున్న శ్రామిక జనాభా:
2040 నాటికి.. చైనా దాని శ్రామిక జనాభా 11 శాతం క్షీణిస్తుందని.. ఆటోమేషన్ కారణంగా 7 శాతం ఉద్యోగాలు కోల్పోనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వృద్ధాప్య శ్రామికశక్తి , తక్కువ జనన రేటు కారణంగా 2020 నుంచి 2040 మధ్య జపాన్ శ్రామిక జనాభా 19 శాతం తగ్గుతుందని.. 2050 నాటికి, ఇది దాదాపు మూడింట ఒక వంతు తగ్గుతుందని అంచనా వేయబడింది. ఆటోమేషన్ ద్వరా వచ్చే మార్పులను తట్టుకునేందుకు APACలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తమ శ్రామిక శక్తి వ్యూహాలను పునరాలోచించాల్సిన అవసరం ఉందని విశ్లేషకుడు మైఖేల్ ఓగ్రాడీ పేర్కొన్నారు.
Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook