విదేశాలకు వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ జోధ్‌పూర్‌ కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ దోషిగా  నిర్ధారణ అయ్యి ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం విదితమే. ప్రస్తుతం బెయిలుపై ఉన్న సల్మాన్, తాను విదేశాలకు దేశాలకు వెళ్లడానికి అనుమతి మంజూరు చేయాలని సల్మాన్‌ తన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను విచారించిన జోధ్‌పూర్‌ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు, నటుడు సల్మాన్ ఖాన్ విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. సల్మాన్ కెనడా, నేపాల్, అమెరికా దేశాలలో 25 మే నుండి 10 జూలై వరకు పర్యటించనున్నాడు.



బాలీవుడ్ ద‌ర్శకుడు అబ్బాస్ అలీ జ‌ఫ‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘భారత్‌’.  ఈ చిత్రంలో న‌టుడు సల్మాన్ ఖాన్ కు జోడీగా కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రా నటించనున్నారని స‌మాచారం. ఈ చిత్రంలో వారిద్దరి పాత్రలకూ ఎంతో ప్రాధాన్యత ఉందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ సినిమాలోని మరో విశేషం కత్రినా, ప్రియాంక తొలిసారి కలిసి నటించబోతున్నారు.