Johnson and Johnson: కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు కారణమైన డెల్టా వేరియంట్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. డెల్టా వేరియంట్‌ను అరికట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందనేది తాజా అధ్యయన విశేషాలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona Pandemic)నియంత్రణకై ప్రపంపవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇటీవల అందుబాటులో వచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ విషయంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌ను అరికట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాకు చెందిన ఓ ల్యాబొరేటరీలో జరిగిన తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ (Johnson and Johnson Vaccine) సింగిల్ డోసు డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని తేలింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని..వ్యాక్సిన్ ప్రభావం దాదాపు 8 నెలలపాటు ఉంటుందని..సింగిల్ బూస్టర్ డోస్ తీసుకుంటే సరిపోతుందని స్పష్టమైంది.


SARS-Cov-2 వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్ధవంతంగా, యాంటీబాడీలు త్వరగా ఉత్పత్తి చేసి డెల్టా వేరియంట్‌ను(Delta Variant)నిర్వీర్యం చేస్తుందని రిపోర్టులో వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో గుర్తించి బీటా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్‌పైనే ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 85 శాతం మందిలో వైరస్ ప్రాణాంతకం కాకుండా నియంత్రించినట్టు తేలింది.కేవలం సింగిల్ డోసు వ్యాక్సిన్ తోనే ఈ పలితాలు వచ్చినట్టు స్పష్టమైంది. ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే 8 నెలలు రక్షణ ఉంటుందనే విషయంలో శాస్త్రీయ ఆధారాలున్నాయంటోంది జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. ఈ వ్యాక్సిన్‌కు ఇంకా భారత దేశ ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంటుంది.


Also read: Pregnant women: గర్భిణీలకు కొవిడ్-19 టీకాలు.. అనుమతించిన కేంద్రం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook