Kamal Haasan to contest in 2021 Tamil Nadu Assembly polls: చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (tamil nadu 2021 election) కోలాహలం మొదలైంది. 2021 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్నా ఆకాంక్షతో తమిళనాడులోని ప్రాధాన పార్టీలన్నీ ఇప్పటికే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం (MNM) అధినేత కమల్‌ హాసన్ (Kamal Haasan)‌.. అసెంబ్లీ ఎన్నికల్లో పొటీపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో నిలుస్తుందని కమల్‌ హాసన్‌ వెల్లడించారు. అయితే ఈ ఎన్నికల్లో సూపర్‌ స్టార్‌ తలైవా.. రజనీకాంత్‌ (Rajinikanth ) మద్దతును కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కమల్ హాసన్ గురువారం మీడియాతో మాట్లాడారు. Also read: Vijay: ఆ పార్టీతో నాకు సంబంధం లేదు: తలపతి విజయ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుపుతున్న రజనీకాంత్‌తో చర్చలు జరుపుతున్నట్లు కమల్‌ హాసన్ పేర్కొన్నారు. అయితే రజనీకాంత్‌ తన రాజకీయ వైఖరిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అయితే అంతకంటే ముందు ఆయన ఆరోగ్యం చాలా ముఖ్యమని సూచించారు. 


తమ ఎంఎన్‌ఎం (Makkal Needhi Maiam ) పార్టీ నిందారోపణలతో కూడిన ప్రతీకార రాజకీయాలు చేయదని కమల్ హాసన్ పేర్కొన్నారు. తమ పార్టీ మార్గదర్శక రాజకీయాలకు కట్టుబడుతూ ముందుకు సాగుతుందని తెలిపారు. వీటన్నింటి ఆధారంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని కమల్ పేర్కొన్నారు. Also read: Covid-19: భారత విమాన సర్వీసులను రద్దు చేసిన చైనా


 Also read : Noel Sean reentry: బిగ్ బాస్‌లోకి నోయల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe