Kangana Ranaut: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించనుంది. ఇప్పటికే మొదటి విడతలో జరిగే 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోవలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు.  ఈ సందర్భంగా మండీ లోక్‌సభ స్థానంలోని కర్సోగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఈమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. మనందరి గురించి ఆలోచించే నాయకుడొకరు నరేంద్ర మోదీ రూపంలో దొరికినట్టు మహిళలు భావిస్తున్నారని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు మహిళ సాధికారిత గురించి చెప్పడమే కాదు.. వారికి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించిన మహనీయడు అంటూ కీర్తించారు. అంతేకాదు ప్రధాని మోదీని శ్రీముడు, విష్ణువు అంశగా పేర్కొంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కంగనా  ఈ సారి ఎన్నికల్లో కంగనా సొంత రాష్ట్రంలోని సొంత ప్రదేశంలోనే ఎంపీ టికెట్ పై పోటీ చేయడం విశేషం. కంగనా కూడా ఇదే లోక్‌సభ నియోజకవర్గంలో పుట్టి పెరిగింది. తొలిసారి కంగనా ఎన్నికల బరిలో దిగింది. ఈ నియోజకవర్గానికి ఏడో విడతలో జూన్ 1వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 4వ తేదిని ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు.



కంగనా సినిమాల విషయానికొస్తే..  2006లో అనురాగ్ బసు డైరెక్షన్‌లో  తెరకెక్కిన 'గ్యాంగ్ స్టర్' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. ఈమెకు బిగ్ బ్రేక్ ఇచ్చిన చిత్రం 'క్వీన్'. అంతకు ముందు 'ఫ్యాషన్' చిత్రంలోని నటనకు ఫస్ట్ టైమ్ జాతీయ సహాయ నటి అవార్డు అందుకుంది. ఆ తర్వాత 'తను వెడ్స్ మను', తను వెడ్స్ మను రిటర్న్స్', పంగా, మణికర్ణిక, తేజస్ చిత్రాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.ఒకసారి సహాయ నటిగా జాతీయ అవార్డు .. మొత్తంగా నాలుగు నేషనల్ అవార్డులు అందుకున్న ఈ తరం నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా. త్వరలో ఈమె 'ఎమర్జెన్సీ' సినిమాతో రానుంది. ఇందులో మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. నటిగా.. నిర్మాతగా, దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు 2020లో పద్మశ్రీతో గౌరవించింది. ఈమె తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన 'ఏక్ నిరంజన్‌' సినిమాలో నటించింది. రీసెంట్‌గా తమిళంలో 'చంద్రముఖి 2' కూడా మెరిసింది.


Also Read: Pawan Kalyan Fever: పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు


Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook