Pawan Kalyan Fever: పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు

Pawan Kalyan Campaign Break Due To Unhealthy: ఈసారి ఎలాగైనా చట్టసభలోకి అడుగుపెట్టాలని కసితో ఉన్న పవన్‌ కల్యాణ్‌ విస్తృత ప్రచారం చేస్తుండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పిఠాపురం నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2024, 09:44 PM IST
Pawan Kalyan Fever: పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు

Pawan Kalyan Fever: ఈసారి ఎన్నికల్లో తాను గెలవడంతోపాటు పార్టీకి అత్యధిక స్థానాలు దక్కేలా ప్రణాళిక వేసుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యాడు. ప్రచారం ప్రారంభించిన రెండో రోజే ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఏపీలో చేపట్టిన ప్రచార యాత్రలో అస్వస్థతకు గురైన పవన్‌ కల్యాణ్‌ హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరాడు. దీంతో జన సైనికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్నారు.

Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు

 

ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ శనివారం వారాహి విజయయాత్ర ప్రారంభించారు. రెండో రోజు ఆదివారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. టీడీపీ, బీజేపీ నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించి తన గెలుపు కోసం ప్రణాళిక వివరించారు. ఈసారి తనను ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని మూడు పార్టీలకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. '40 రోజులు మూడు పార్టీల కార్యకర్తలు దీక్ష చేసినట్లుగా పని చేద్దాం. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకే పొత్తు కోసం నేను పరితపించా. పిఠాపురంలో నా గెలుపు బాధ్యత మాజీ ఎమ్మెల్యే వర్మదే' అని స్పష్టం చేశారు.

Also Read: Bus Yatra: చంద్రబాబు జిత్తులమారి.. పొత్తులమారి: బస్సు యాత్రలో జగన్‌ ధ్వజం

 

యాత్ర ప్రారంభించిన రెండు రోజుల నుంచి పవన్‌ కల్యాణ్‌ నలతగా ఉన్నారు. ఆదివారం అస్వస్థతకు గురవడంతో అకస్మాత్తుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లాడు. జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు పవన్‌ వెళ్లాడు. షెడ్యూల్ ప్రకారం రేపు, ఎల్లుండి కూడా పవన్‌ పిఠాపురంలో ప్రచారం చేయాల్సి ఉంది.

పవన్‌ ముందస్తు షెడ్యూల్‌ (అస్వస్థతకు గురవడంతో పర్యటనలో మార్పులు జరిగాయి)

  • ఏప్రిల్ 3న తెనాలి
  • ఏప్రిల్ 4 నెల్లిమర్ల
  • ఏప్రిల్ 5 అనకాపల్లి 
  • ఏప్రిల్ 6 ఎలమంచిలి
  • ఏప్రిల్ 7 పెందుర్తి
  • ఏప్రిల్ 8 కాకినాడ రూరల్
  • ఏప్రిల్ 9 పిఠాపురం
  • ఏప్రిల్ 10 రాజోలు
  • ఏప్రిల్ 11 పి గన్నవరం
  • ఏప్రిల్ 12 రాజానగరం
     

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News