కర్ణాటక శాసనసభకు ఇవాళ జరిగిన ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక బీఎస్ యెడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ సిద్ధరామయ్య ఆశలకు గండికొడుతుందా ? లేదంటే జనతా దళ్ (సెక్యులర్) ఈ ఇద్దరి గేమ్ ని చెడగొట్టి కింగ్ మేకర్ అవుతుందా ? ఇటువంటి సందేహాలన్నింటికీ సమాధానం తెలియాలంటే మే 15న జరిగే ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడే వరకు వేచిచూడాల్సిందే. అయితే, అంతకన్నా ముందుగా వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో వున్న 5.06 కోట్ల మంది ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యం వస్తుందని వుండగా, ఇంకొన్ని ఫలితాలు కన్నడ ఓటర్లు ఈసారి బీజేపీకే పట్టం కడతారు అని నిగ్గుతేల్చాయి. అయితే, అన్ని ఫలితాల్లో కూడా జేడీ(ఎస్)కి మూడో స్థానమే దక్కింది. 


మేజర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా వున్నాయి.


Dugvijay News Exit Polls: 
దుగ్విజయ్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ : 
బీజేపీ : 103-107, 
కాంగ్రెస్ : 76-80, 
జేడీఎస్ :31-35, 
ఇతరులు : 04-08


Suvarna exit poll survey : 
సువర్ణ ఎగ్జిట్ పోల్ సర్వే :
కాంగ్రెస్ : 106-118, 
బీజేపీ : 79-92, 
జేడీఎస్ :22-30, 
ఇతరులు : 01-04


ABP-C Voter exit poll : 
ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ : 
బీజేపీ : 97-109,
కాంగ్రెస్ : 87-99,
జేడీ (ఎస్) : 21-30,
ఇతరులు : 01-08


Republic TV Jan Ki Baat exit polls :
రిపబ్లిక్ టీవీ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ :
బీజేపీ : 91-114
కాంగ్రెస్ : 73-82,
జేడీఎస్ : 32-42


IndiaTV Exit poll
ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ :
బీజేపీ : 87
కాంగ్రెస్ : 97
జేడీ(ఎస్) : 35


News X-CNX exit poll:
న్యూస్ ఎక్స్-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్:
బీజేపీ : 102-110
కాంగ్రెస్ : 72-78
జేడీఎస్ : 35-39


Times Now Exit poll :
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ :
కాంగ్రెస్ : 90-103
బీజేపీ : 82-93
జేడీఎస్ : 31-39


India Today Exit poll :
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ :
కాంగ్రెస్ : 106-118
బీజేపీ : 79-92
జేడీఎస్ : 22-30
ఇతరులు : 01-04