karnataka: సీఎం యడియూరప్పకు కరోనా
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడుతున్న నాయకులు, ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah )కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన కొంతసేపటికే తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ( Banwarilal Purohit ) కు కూడా కరోనా సోకినట్లు గుర్తించారు.
yediyurappa tested corona positive: బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడుతున్న నాయకులు, ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah )కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన కొంతసేపటికే తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ( Banwarilal Purohit ) కు కూడా కరోనా సోకినట్లు గుర్తించారు. ఆ తర్వాత మరికొన్ని గంటల్లోనే కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ( BS yediyurappa ) కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు యడియూరప్ప ట్విట్ చేసి తెలిపారు. తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌లో ఉండి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. Also read; Covid19: కేంద్రమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్
ఇదిలాఉంటే.. శుక్రవారం సీఎం యడియూరప్ప గవర్నర్ వాజుభాయ్ వాలాను బెంగళూరులో కలిశారు. ఆ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు కూడా హాజరయ్యారు. దీంతో ప్రస్తుతం వారంతా హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఇదిలాఉంటే.. ఇటీవలనే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Also read; Banwarilal Purohit: తమిళనాడు గవర్నర్‌కు కరోనా