DGP on Mangaluru Auto Rickshaw Blast: కర్ణాటకలోని మంగళూరులో శనివారం కదులుతున్న ఆటో రిక్షాలో పేలుడు సంభవించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌, ప్రయాణికుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కర్ణాటక డీజీపీ మాట్లాడుతూ.. ఈ పేలుడు ప్రమాదవశాత్తు సంభవించింది కాదని.. తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశంతో జరిగిన ఉగ్ర చర్య అని తెలిపారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర పోలీసులు కేంద్ర ఏజెన్సీలతో క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నామని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళూరులో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో కదులుతున్న ఆటో రిక్షాలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఆటో డ్రైవర్‌, ఆటో రిక్షాలో కూర్చున్న ఓ ప్రయాణికుడికి గాయాలపాలయ్యారు.  దగ్ధమయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పేలుడు ఘటనపై కర్ణాటక పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ ఘటనలో పేలుడు జరిగిన విషయాన్ని శనివారం పోలీసు అధికారులు ధృవీకరించలేదు. నగర పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ అనంతరం ఆటో రిక్షాకు మంటలు అంటుకున్నాయని భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రత్యేక బృందాన్ని, ఎఫ్‌ఎస్‌ఎల్‌ (ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌) బృందాన్ని పిలిచామని శశికుమార్‌ తెలిపారు. 


అయితే విచారణలో అయితే విచారణలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 'పేలుడు ప్రమాదవశాత్తు కాదు. కానీ తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశ్యంతో జరిగిన టెర్రర్ చర్య. దీనిపై కేంద్ర ఏజెన్సీలతో పాటు కర్ణాటక రాష్ట్ర పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.' అని కర్ణాటక డీజీపీ తెలిపారు.


Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బ్యాక్.. ట్విట్టర్‌ అకౌంట్ రీ ఓపెన్.. కానీ..!  


Also Read: Trending Video: చిన్న స్పెల్లింగ్ మిస్టేక్.. కుక్కలా మారిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి