Karnataka Exit Polls 2023: కర్ణాటకలో 2018 రిపీట్ కానుందా, జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందా
Karnataka Exit Polls 2023: కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషించనుందా అంటే పరిస్థితి అలాగే కన్పిస్తోంది. 2018 ఎన్నికల్లో పోషించిన పాత్రనే జేడీఎస్ పోషించవచ్చని తెలుస్తోంది. జేడీఎస్ నేత కుమారస్వామి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
Karnataka Exit Polls 2023: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ వెనుకంజ వేసేలా కన్పిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోవచ్చు. రాష్ట్రంలో ఏయే అంశాల ఆధారంగా ఓటింగ్ జరిగింది, ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే వివరాలు మీ కోసం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మెజార్టీ సర్వే సంస్థల సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేజీక్ ఫిగర్‌కు చేరువలో రానుందని తెలుస్తోంది. ఒకట్రెండు సర్వే సంస్థలు తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్ పార్టీకు 114 లేదా 116 సీట్ల వరకూ రావచ్చని తెలిపాయి. కొన్ని సంస్థలు 112-114 స్థానాలు గెల్చుకుంటుందన్నాయి. అటు కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ పార్టీకు 24-26 సీట్లు రావచ్చని అన్ని సంస్థలు అంచనా వేశాయి.
2018 ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మేజిక్ ఫిగర్‌కు దూరం కావడంతో 26 స్థానాలు గెల్చుకున్న జేడీఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పగ్గాలిచ్చి కాంగ్రెస్ పార్టీ బీజేపీను అధికారానికి దూరం చేసింది. అయితే ఏడాదిన్నర తిరిగేసరికి ఆ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ తిరిగి అధికారం చేపట్టింది.
కర్టాటకలో అధికారం కోసం కావల్సిన మేజిక్ ఫిగర్ 113. కాంగ్రెస్ పార్టీ 112-116 స్థానాలు గెల్చుకోవచ్చు. సర్వే ఫలితాల్లో 2-4 స్థానాలు ఎప్పుడూ అటూ ఇటూ ఉంటుంది. అదే జరిగి కాంగ్రెస్ పార్టీ 110 లేదా 108 స్థానాలకు పరిమితమైతే జేడీఎస్ మద్దతు తప్పనిసరి. అదే సమయంలో బీజేపీ పార్టీ 108 లేదా 104 స్థానాల వద్ద ఆగిపోయినా జేడీఎస్ మద్దతు తీసుకుని అధికారం కైవసం చేసుకునే అవకాశాల్లేకపోలేదు. ఎందుకంటే జేడీఎస్ పార్టీ ఎప్పుడూ బీజేపీకు పూర్తిగా దూరమనే వైఖరిని ప్రకటించలేదు.
అంటే 2018లానే జేడీఎస్ ఈసారి కూడా కింగ్ మేకర్ లేదా కింగ్ కావచ్చు. అధికార ఏర్పాటులో కీలకపాత్ర పోషించవచ్చు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ కింగ్ మేకర్ కానుందని కుమారస్వామి స్వయంగా పోలింగ్ సందర్భంగా వెల్లడించారు.
Also read: ప్రశాంతంగా కర్ణాటక ఎన్నికల పోలింగ్.. పోలింగ్ ఎంత శాతం అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook