Karnataka omicron cases: కర్ణాటకలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు..ఆ రాష్ట్రంలో 14కి చేరిన కేసుల సంఖ్య
Karnataka: కర్ణాటకలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని రెండు క్లస్టర్లలోని రెండు విద్యాసంస్థల్లో ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
Karnataka omicron new cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(omicron) కల్లోలం సృష్టిస్తోంది. భారత్ ఒమిక్రాన్ కేసులు(Omicron cases in india) పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దక్షిణ కన్నడ జిల్లా(Dakshina Kannada District)లోని రెండు క్లస్టర్లలోని రెండు విద్యాసంస్థల్లో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా యూకే నుంచి ఓ ప్రయాణికుడికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్(Karnataka's Health Minister Dr Sudhakar) ధృవీకరించారు.
దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 14కు చేరింది. మెుదటి క్లస్టర్(First cluster)లో 14 పాజిటివ్ కేసులు రాగా..ఇందులో నలుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. రెండో క్లస్టర్(Second cluster) లో 19 పాజిటివ్ కేసులు రాగా...ఇందులో ఒకరికి ఒమిక్రాన్ గా తేలింది. దీంతో రెండు క్లస్టర్స్ నుంచి ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దేశంలోని మెుదటి రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలోనే వచ్చాయి.
Also Read: Omicron Cases: భారత్‌లో ఒమిక్రాన్ విజృంభన, 109 కి చేరిన కేసులు..జాగ్రత్త అంటోన్న కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook