Karnataka: యువతి బలవన్మరణం..కాబోయే భర్త వేధింపులే కారణం..!
ఓ యువతి కాబోయే భర్త వేధింపుల్ని తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటన కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
Young Woman Suicide in Karnataka: పెళ్లి చోసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకుంది. వివాహం నిశ్చయమైన యువతి ఇంకా పెళ్లి పీటలు ఎక్కకమునుపే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. కాబోయే భర్త వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటక కర్ణాటక రాష్ట్రం(Karnataka)లో వెలుగుచూసింది.
హుబ్లీ ప్రశాంత్‌నగర్‌కు చెందిన పవిత్రా పాటిల్ అనే యువతి ఆత్మహత్య(Young Woman Suicide) చేసుకుంది. కాబోయే భర్త వేధింపులే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పవిత్రా పాటిల్‌కు హావేరికి చెందిన అభినందన్ అనే యువకుడితో ఇటీవల నిశ్చితార్థం(Engagement) జరిగింది. డిసెంబరు 2న వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు.
Also read: Crime News: ప్రియుడి కోసం కన్నతండ్రినే కడతేర్చిన కూతురు!
ఇటీవలే వీరిద్దరూ దాండేలికి విహారయాత్రకు వెళ్లి అనేక ఫొటోలు తీసుకున్నారు. అప్పటి నుంచి అభినందన్ అనేక అనుమానాలు పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని అనుమానంగా చూడడమే కాకుండా పవిత్రా పాటిల్‌ను వేధించేవాడని ఆరోపించారు. ఈ వేధింపుల(Harassment)ను తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అశోక్ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అభినందన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook