మద్యం విక్రయాలు మొదలయ్యాక కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే పలు విషయాలతో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే భయంకరమైన ఘటనతో మరోసారి ఆ రాష్ట్రం చర్చనీయాంశమైంది. తన దారికి అడ్డొచ్చిందని ఓ మందుబాబు ఏకంగా పామునే కరకర నమిలేశాడు. కోలారు జిల్లా ముళబాగిలు తాలుకాలో ఘటన చోటుచేసుకుంది. కేసీఆర్‌ నోట ‘నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా రోజుల తర్వాత మద్యం అమ్మకాలు సోమవారం తిరిగి ప్రారంభం కాగా, ముష్టూరుకు చెందిన కుమార్‌ అనే ఓ వ్యక్తి వైన్స్‌ షాపులో మద్యం కొని పీకలదాగా తాగాడు. తర్వాత తన బైకు మీద ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు.


దారిలో ఓ పాము అడ్డం వచ్చింది. అసలే తాగిన మైకంలో ఉన్న కుమార్‌ బైక్‌ దిగి పామును పట్టుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నాకే అడ్డు వస్తావు అంటూ పాము తల భాగాన్ని కొరికి చంపేశాడు. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీసి షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. అయితే మెడలోనే పామును వేసుకుని అలాగే వెళ్లడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!