`నిందితులను ఉరి తీయండి లేదా మమ్మల్ని చంపేయండి`: కథువా భాదితురాలి తల్లి ఆవేదన
`నిందితులను ఉరి తీయండి లేదా మమ్మల్ని కాల్చేయండి` అంటూ కథువా బాధితురాలి తల్లి పేర్కొంది.
'నిందితులను ఉరి తీయండి లేదా మమ్మల్ని కాల్చేయండి' అంటూ కథువా బాధితురాలి తల్లి పేర్కొంది. ఒక ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి ఆ చిన్నారిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. నిందితులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో కథువా నిందితురాలి తల్లి ఓ ఆంగ్ల ఛానెల్‌తో మాట్లాడింది. కథువా ప్రాంతంలో నాలుగు గ్రామాలు మా కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆమె అన్నారు. కథువా నిందితులను వదిలేస్తే వారు తమను చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. మేం సర్వం పోగోట్టుకున్నాం.. ఇంటిని, మా కుమార్తెను.. అన్నింటినీ పోగొట్టుకున్నామని ఆమె పేర్కొన్నారు. కాగా కథువా బాధితురాలి తండ్రి ఈ కేసు విచారణను జమ్మూకాశ్మీర్‌లో కాకుండా బయట నిర్వహించాలని సుప్రీం కోర్టును కోరారు. ఇక్కడ తమకు రక్షణ లేదని పేర్కొన్నారు.
కేంద్ర బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ద్వారా దర్యాప్తునకు స్థానిక రాజకీయ నాయకులు తన కుటుంబంపై ఒత్తిడి చేస్తున్నారని కథువా తల్లి ఆరోపించింది. "నిందితులను రక్షించడానికి" సిబిఐ దర్యాప్తు జరిపించాలని రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారని కథువా తల్లి ఆరోపించింది.