Kaun Banega Crorepati: కౌన్ బనేగా క్రోర్‌పతి. టీవీ మాధ్యమంలో చాలా పాపులర్ షో. కేవలం కాసులు మాత్రమే కురిపించే షో నిన్నటి వరకూ. కానీ ఇప్పుడు చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. అదేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన టీవీ షోలలో ఒకటి కౌన్ బనేగా క్రోర్‌పతి(Kaun Banega Crorepati). బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 13 ప్రారంభమైంది. మేధస్సు, అదృష్టం, విజ్ఞానం ఉంటే తప్పకుండా లక్షలో, కోట్లో గెల్చుకుని వెళ్లవచ్చు. లేదా బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను స్వయంగా కలుసుకుని రావచ్చు. కేబీసీ అంటే కేవలం కాసులు కురిపించే షోగానే ఉంది నిన్నటి వరకూ. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ఆ ఘటనతో చిక్కులు కూడా వస్తాయని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..


రాజస్థాన్‌కు(Rajasthan) చెందిన వృత్తిరీత్యా రైల్వే అధికారి అయిన దేశ్‌బంధు పాండే కేబీసీ సీజన్ 13(KBC Season13)లో పాల్గొనే అర్హత సాధించారు. అంతేకాదు హాట్ సీటులో కూర్చున్నారు కూడా. చకచకా ఓ లైఫ్‌లైన్ మిగిలుండగానే పది ప్రశ్నలకు సమాధానం చెప్పి..అందర్నీ ఆకట్టుకున్నాడు. పదకొండో ప్రశ్న..6 లక్షల 40 వేల ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పి..3 లక్షల 20 వేల రూపాయలతో నిష్క్రమించారు. ఇంతవరకూ బాగానే ఉంది. కేబీసీ హాట్ సీట్‌లో కూర్చోవడం, అమితాబ్ బచ్చన్‌ను(Amitabh Bachchan)కలవాలన్న చిరకాల స్వప్నాన్ని పూర్తి చేసుకోవడం, 3 లక్షల నగదు గెలవడంతో ఆనందంగా ఇంటికి చేరాడు. ఇంటికి రాగానే రైల్వే అడ్మినిస్ట్రేటివ్ విభాగం అతడికి ఛార్జిషీటు అందించింది. ఫలితంగా చట్టపరమైన చర్యలతో సతమతమవుతున్నాడు. కేబీసీలో పాల్గొనేందుకు ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13 వరకూ దేశ్‌బంధు పాండే ముంబైలో ఉన్నారు. అంతకుముందే సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ సెలవు మంజూరు కాకుండానే కేబీసీ కోసం ముంబై వెళ్లిపోయారు. దాంతో రైల్వే శాఖ ఛార్జిషీటు దాఖలు చేసింది. రైల్వేశాఖ(Railway Department)చర్యలపై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రైల్వే శాఖ అన్యాయంగా వ్యవహరిస్తోందని రైల్వే మజ్దూర్ సంఘ్ ధ్వజమెత్తింది. 


Also read: Krishna Janmashtami 2021: దేశవ్యాప్తంగా వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు...ఫోటోస్ వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook