కౌన్ బనేగా కర్‌డ్‌పతి (Kaun Banega Crorepati) సీజన్ 12లో మొట్టమొదటి కోటీశ్వరురాలు నాజియా నసీమ్. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాంచీ నివాసి అయిన నాజియా నసీమ్ (Nazia Nasim) పేరు కేబీసీ వేదికతో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ సీజన్ 12లో తొలి కోటీశ్వరురాలిగా నాజియా నసీమ్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఢిల్లీలో సెటిల్ అయ్యారు. అయితే కోటి రూపాయాల ప్రశ్నకు సమాధానం చెప్పిన నాజియా నసీమ్ రూ.7 కోట్ల ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు.



 


రూ.25 లక్షల రూపాయల ప్రశ్న ఒక్క లైఫ్‌లైన్ కూడా ఆమె వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో లైఫ్‌లైన్స్ వాడుకుంటూ రూ.కోటి రూపాయాల ప్రశ్నకు బదులిచ్చారు. 
ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్న నటి ఎవరు?  అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం రూపా గంగూలీ అని ఠక్కున నాజియా నసమీమ్ సమాధానం చెప్పారు. దీంతో ఆమె రూ.7కోట్ల ప్రైజ్ మనీ సైతం గెలుచుకుంటారని అంతా భావించారు.



 


కేబీసీ 12లో రూ.7 కోట్ల ప్రశ్న ఇది..
నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వం మొదటి ప్రకటన సింగపూర్‌లో ఎక్కడ చేశారు?
A) Cathay Cinema Hall B) Fort Canning Park C) National University of Singapore D) National Gallery Singapore ఆప్షన్లు ఇచ్చారు. కానీ నాజియా నసీమ్ సమాధానం చెప్పలేకపోయారు.



 


బ్రిటన్ టీవీ షో ఆధారంగా కౌన్ బనేగా కరోడ్‌పతి రూపొందించారు. కేబీసీ 3వ సీజన్ షారుక్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన కేబీసీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కేబీసీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే.


రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం : ఆప్షన్ A


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook