ఉత్తరాఖండ్ రాష్ట్రములోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ మందిరాన్ని అక్టోబర్ 21న మూసివేశారు. శీతాకాల విరామం దృష్ట్యా ఆలయంలోని మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మూసివేశారు. వచ్చే ఏడాది మే నెల మూడవ తేదీన ఆలయం తెరుచుకోనుంది. ఈ ప్రాంతంలో నవంబర్ నుండి ఏప్రిల్ వరకు మంచు కురుస్తుంది. దాంతో రహదారులన్నీ మంచుతో మూసుకుపోతాయి. భక్తులు, సందర్శకులు రావడానికి ఇబ్బందిపడతారు. కేదార్నాథ్ తో పాటు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ క్షేత్రాలను శీతాకాలంలో మూసి మరళా వేసవిలో ఆర్నెళ్ల తరువాత తెరుస్తారు.


ఆది శంకరాచార్య చేత క్రీ.శ. 8వ శతాబ్దంలో నిర్మించబడిన ప్రస్తుత కేదార్నాథ్ ఆలయం పాండవులచే నిర్మించబడిన పూర్వపు ఆలయానికి ప్రక్కనే ఉంది. ఆలయం లోపలి గోడలు పురాణాల నుండి సేకరించబడిన వివిధ దేవతల మరియు సన్నివేశాల చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి.