Kerala Assembly Elections: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్  సంచలనం రేపారు. అది ఆయన ఆస్థి వివరాలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల ప్రచారం పీక్స్‌కు వెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ( Kerala Assembly Elections) ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మాడం నుంచి పోటీ చేస్తున్నారు. ఇవాళ ఆయన నామినేషన్ వేసిన సందర్బంగా సంచలనం రేపారు. నామినేషన్ ( Nomination) ‌లో సమర్పించిన ఆఫిడవిట్‌లో ఆయన పొందుపర్చిన వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. అది ఆయన ఆస్థి వివరాలు. 


పినరయి విజయన్( Pinarayi vijayan) ఆస్థులన్నీ కలిపితే కేవలం 54 లక్షలేనట. 2020-21 లో వార్ధిక ఆదాయం 2.87 లక్షలుగా పేర్కొన్నారు. రెండు సొంత ఇళ్లున్నాయని..సొంత వాహనం లేదని ప్రకటించారు. పినరయి పేరిట 51.95 లక్షల విలువైన స్థిరాస్థులు, 2.04 లక్షల విలువైన చరాస్థులు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. భార్య పేరిట 35 లక్షల విలువైన స్థిరాస్థులు, 29.7 లక్షల చరాస్థులు ఉన్నాయట. ఈ ఇద్దరికీ అప్పులు మాత్రం లేవని వెల్లడించారు. పినరయి విజయన్‌పై రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. 2016 నుంచి ఈయన కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోసారి విజయం సాధిస్తారనే ప్రచారం ఉంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళ అసెంబ్లీకు ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది.


Also read: Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook