Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ ఇవే

5 Rules Changing From April 1 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో కొన్ని మార్పులను స్వాగతించారు. కొన్ని రకాల జీతాలు అందుకునే వారికి కొత్త నియమాల ద్వారా ఉపశయం కలగనుంది. ఇందుకోసం కొత్త సరళీకృత ఆదాయపు పన్ను పాలసీని ప్రకటించారు.

1 /6

5 Rules Changing From April 1 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో కొన్ని మార్పులను స్వాగతించారు. కొన్ని రకాల జీతాలు అందుకునే వారికి కొత్త నియమాల ద్వారా ఉపశయం కలగనుంది. ఇందుకోసం కొత్త సరళీకృత ఆదాయపు పన్ను పాలసీని ప్రకటించారు. 2021 ఏప్రిల్ 1 నుండి జీతాలపై ఆదాయపు పన్ను మార్పులు అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 1వ తేదీన నుంచి అమల్లోకి వచ్చే నియమాలు ఇవే. Also Read: EPFO: ఆరు నెలల్లో 71.01 లక్షల EPF Accounts క్లోజ్ చేసిన ఈపీఎఫ్‌వో

2 /6

ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్‌ ద్వారా ఓ సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైగా ఆర్జించే మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 2021 ఏప్రిల్ 1 నుండి ఈపీఎఫ్ నగదుపై వార్షికంగా రూ.2.5 కన్నా అధికంగా ఆర్జించే నగదుకు పన్ను విధించనున్నారు. రూ .2 లక్షల కన్నా తక్కువగా ఆర్జించే ఈపీఎఫ్ ఖాతాదారులకు దీని వల్ల ఏ నష్టం ఉందని, వారిపై ప్రభావం ఉండదని నిర్మలా సీతారమన్ అన్నారు. Also Read: EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు

3 /6

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగానే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫామ్ ఇవ్వనున్నారు. ఆదాయపన్ను చెల్లింపులను చెల్లించడం, ఐటీ రిటర్న్స్ దాఖలును సులభతరం  చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందే నింపిన ఐటిఆర్‌లు పన్ను చెల్లింపుదారుడి ఆదాయం మరియు ఇతర  డేటాను సొంతంగానే అప్‌లోడ్ చేస్తాయి.

4 /6

సెలవు ప్రయాణాల నగదుపై రాయితీ (LTC Scheme) నగదు వోచర్ పథకాన్ని 2021 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 సంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయాణాలపై కొంత కాలం ఆంక్షలు విధించడం తెలిసిందే. ఆ కారణాలతో సాధారణ ఎల్‌టిసి పన్ను ప్రయోజనాన్ని పొందలేని ఉద్యోగులకు పన్ను ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని ప్రకటించింది. Also Read: EPFO: EPF ఖాతాదారులు హోమ్ లోన్, Personal Loan ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి

5 /6

ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనివారిపై కొరడా ఝులిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని ఉద్యోగులకు అత్యధిక టీడీఎస్ విధించాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేకంగా 206AB అనే కొత్త నిబంధనను ఆదాయ పన్ను చట్టంలో చేర్చారు.

6 /6

సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం  ఆదాయపు పన్నులో ఊరట కల్పించింది. 75 ఏళ్లు పైబడిన వారు ఆ వయసు కేటగిరీలో కేవలం పెన్షన్ ఆదాయం మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ మాత్రమే పొందేవారు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసిన అవసరం లేదు. ఆ సీనియర్ సిటిజన్లు చెల్లించాల్సిన ఆదాయపు పన్నును కొంతమేర తగ్గించడంతో పాటు స్వయంగా బ్యాంకులే ప్రభుత్వానికి జమ చేయనున్నాయని పేర్కొన్నారు. వ్యక్తికి కేవలం పెన్షన్ ఆదాయం మాత్రమే ఉండాలి మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి వడ్డీ ఒకే బ్యాంకులో పొందేవారు అయి ఉండాలని ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే గతంలో తెలిపారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook