Kerala Governor response on assembly resolution : అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం చెల్లదు
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం - caa-2019కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పందించారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం - caa-2019కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పందించారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా అందరు సభ్యులు ఆమోదించినప్పటికీ దానికి ఎలాంటి చట్టపరమైన విలువ ఉండదని చెప్పారు. రాజ్యాంగపరంగా చూసినా చెల్లబోదని తేల్చి చెప్పారు. పౌరసత్వం ఇవ్వడమనేది .. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం ఉండదని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వివరించారు. కాబట్టి ..కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేశారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకునే అకాశం ఉండదని తేల్చి చెప్పారు. కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యతిరేకించడం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమైంది. మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Read Also:ఆ చట్టం మాకొద్దు- కేరళ అసెంబ్లీ తీర్మానం